![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 ఎనిమిదవ వారం నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందిలో ఎవరు ఎలిమినేటేడ్ అవుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఇక సండే ఫండే అంటూ నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్స్ తో వచ్చీ రాగానే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు నాగార్జున.
కొన్ని ట్యాగ్ లు తీసుకొచ్చి హౌస్ లోకి ఒక్కో కంటెస్టెంట్ కి ఇచ్చాడు నాగార్జున. "గాడిదకేం తెలుసు గందపు చెక్క వాసన" అనే ట్యాగ్ అశ్వినిశ్రీకి అమర్ దీప్ వేశాడు. వచ్చినప్పుడు వీడు ఇలా ఆడతాడని అనుకోలేదు. ఏకులా అనుకొని మేకులా కూర్చున్నాడని పల్లవి ప్రశాంత్ కి అంబటి అర్జున్ ఇచ్చాడు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే ట్యాగ్ టేస్టీ తేజకి ప్రశాంత్ ఇచ్చాడు. అక్కడ లొల్లి పెద్దగా అయింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే ట్యాగ్ అశ్వినిశ్రీకి ప్రియాంక ఇచ్చింది. ఓడెక్కేవరకు ఓడ మల్లన్న.. ఓడ దొగినాక బోడి మల్లన్న అనే ట్యాగ్ భోలే షావలికి రతిక ఇచ్చింది. బ్లాక్ బాల్ గురించి చెప్పింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని రతికకి గౌతమ్ కృష్ణ ఇచ్చాడు. పొరుగింటి పుల్ల కూర భోలేకి టేస్టీ తేజ ఇచ్చాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని శివాజీకి యావర్ ఇచ్చాడు. వేలు ఇస్తే చేయి గుంజినట్టు అనే ట్యాగ్ ని ప్రియాంకకి అశ్విని ఇచ్చింది. కందకు లేని దురద కత్తికి ఎందుకని టేస్టీ తేజకి శివాజీ ఇచ్చాడు. ఇటు రా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు అని టేస్టీ తేజకి శోభాశెట్టి అని ఇచ్చింది. ఇట్స్ హర్ పర్సనల్ ఒపీనియన్ సర్ అని టేస్టీ తేజ ఇచ్చాడు.
ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా.. మొదట భోలే షావలి, అమర్ సేఫ్ అయ్యారు. మిగిలిన ఆరుగురిలో ప్రియాంక, అంబటి అర్జున్ సేవ్ అయ్యారు. గేమ్స్ లో కాకుండా హౌస్ లో కూడా యాక్టివ్ పర్ఫామెన్స్ ఇస్తానని అర్జున్ అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టిని లేపి.. నీకొక్కదానికే తినిపించానని ప్రశాంత్ అన్నాడు కదా చూడమని ఒక వీడియో వేసి చూపించాడు నాగార్జున. అందులో రతిక, అశ్వినిశ్రీ, ప్రియాంక లకి తినిపించిన పల్లవి ప్రశాంత్ చూపించగానే అందరు నవ్వుకున్నారు. నామినేషన్ లో శోభాశెట్టి సేవ్ అయింది. ఆ తర్వాత యావర్, రతిక, టేస్టీ తేజ ఉన్నారు. ఇక పాము, పుట్ట తీసుకొచ్చి ఎలిమినేషన్ ప్రక్రియలో యావర్ సేవ్ అయ్యాడు. ఇక చివరలో రతిక, టేస్టీ తేజ ఉండగా.. యూ ఆర్ ఎలిమినేటెడ్ తేజ, యూ ఆర్ సేఫ్ రతిక అని నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత అందరికి బై చెప్పేసి వచ్చాడు టేస్టీ తేజ.
![]() |
![]() |